ఒకప్పుడు టాలీవుడ్ (Tollywood)లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ప్రియమణి (Priyamani), ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్ అనే తేడాలు లేకుండా తనకు నచ్చిన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్ సిరీస్ (Web Series) ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా, తాజాగా ‘గుడ్ వైఫ్’ (Good Wife) అనే కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. అమెరికన్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’ (The Good Wife) ఆధారంగా ఈ సిరీస్ రూపొందినట్లు సమాచారం.
సాధారణంగా పాన్ ఇండియా (Pan India) రిలీజ్ అంటే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడం ఆనవాయితీగా ఉంది. అయితే, ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్ దీనిని మించి విస్తృత రిలీజ్‌తో వస్తోంది. ఈ సిరీస్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు








