ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేస్తూ బస్సు దిగి రోడ్డు మీదకు పరుగుల తీశారు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల టోల్‌గేట్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువన్నామలై నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్న బస్సు నంద్యాల టోల్‌గేట్ సమీపంలో రాగానే ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్ అయింది, వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంభవంతో బస్సులోని 35 మంది ప్రయాణికులు ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు.
ప్రయాణికులు సురక్షితం..
ప్రయాణికులు క్షేమంగా బయటపడటం ఆందోళనకర సమయంలో కొంత ఊరటనిచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను కట్టడి చేసి ప్రాణనష్టం లేకుండా చేసారు. ఈ ప్రమాదంలో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సమయానికి స్పందించిన ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.