మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ (Manipur) రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన(President’s Rule) విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

2023లో రెండు జాతుల మధ్య వివాదాలు చెల‌రేగి.. అవి దాడు చేసుకునే స్థాయికి చేరాయి. రెండు జాతుల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌ల్లో దాదాపు 300 మంది ప్రజలు మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బీరెన్‌ సింగ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.

బీరెన్ సింగ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన‌ తర్వాత రాజకీయ అనిశ్చితి మరింత పెరిగింది. తాజా పరిణామాలతో మణిపూర్ భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. చివరగా రాష్ట్రపతి పాలన విధించడంపైనే కేంద్రం మొగ్గు చూపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment