భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi)లో పర్యటించనున్నారు. ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్న సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం ఇవ్వడానికి సన్నద్ధమయ్యారు. కొద్ది సేపట్లో రాష్ట్రపతి పుట్టపర్తికి చేరుకోనుండగా, శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) శత జయంతి ఉత్సవాల్లో ఆమెతో పాటు ముఖ్యమంత్రి కూడా పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం పుట్టపర్తి విమానాశ్రయంలో నుంచి ఆమె బయల్దేరి వెళ్లనున్నారు. గురువారం తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారి (Sri Padmavathi Ammavaru) కార్తీక బ్రహ్మోత్సవాలకు హాజరైన రాష్ట్రపతి, శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు.
సీఎం పర్యటన..
రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికి, సాయంత్రం శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి హాజరు కానున్నారు. రాత్రికి పుట్టపర్తిలోనే బసచేసే ముఖ్యమంత్రి, రేపు ఉదయం శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని, మధ్యాహ్నం ఉండవల్లి తిరిగి చేరుకోనున్నారు.








