ప్రీతి జింటా.. మోస్ట్ స‌క్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌

ప్రీతి జింటా.. మోస్ట్ స‌క్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌

ఒకప్పుడు సినీ తారగా వెండితెరపై రాణించిన ప్రీతి జింటా (Preity Zinta), గత 8 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, వ్యాపార రంగంలో అద్భుత విజయాలు సాధిస్తూ రూ.35 కోట్ల పెట్టుబడిని రూ.350 కోట్ల సామ్రాజ్యంగా మార్చింది. 2000లలో తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన అందం, అభినయంతోతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి.. ఇప్పుడు వ్యాపారవేత్తగా (Businesswoman) సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

భారతీయ సినీ రంగంలో ఒకప్పుడు బ్యాక్-టూ-బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్‌ను శాసించిన ప్రీతి, పెళ్లి తర్వాత విదేశాల్లో స్థిరపడి, వ్యాపారంలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఆమె నెట్ వర్త్ వివరాలు తాజాగా అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఐపీఎల్‌(IPL)లో పంజాబ్ కింగ్స్ జట్టు (Punjab Kings Team) సహ యజమాని (Co-Owner)గా 2008లో రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆమె, ఇప్పుడు ఆ జట్టు విలువ రూ.250 కోట్లకు చేరింది. 2022 నాటికి జట్టు విలువ 76 మిలియన్ డాలర్ల నుంచి 925 మిలియన్ డాలర్లకు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. టిక్కెట్ అమ్మకాలు (Ticket Sales), స్పాన్సర్‌షిప్‌ (Sponsorships)ల ద్వారా కూడా ఆమె ఆదాయం సంపాదిస్తోంది.

ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓడినప్పటికీ, ప్రీతి తన జట్టుకు అండగా నిలిచింది. సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లు, పెట్టుబడులతో ఆమె ఆస్తులు రూ.183 కోట్లుగా అంచనా వేయబడ్డాయి. ముంబైలోని పాలి హిల్స్‌లో రూ.17.01 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, సిమ్లాలో రూ.7 కోట్ల ఇల్లు ఆమె సొంతం. లెక్సస్ LX 400, పోర్స్చే, మెర్సిడెస్ బెంజ్ E క్లాస్, BMW వంటి ఖరీదైన కార్ల సేకరణ కూడా ఆమె వద్ద ఉంది.

ప్రీతి జీన్ గుడ్ ఎనఫ్‌ (Gene Goodenough)ను ప్రేమించి పెళ్లి చేసుకుని, లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లో (Beverly Hills, Los Angeles) తన భర్త, ఇద్దరు పిల్లలు జై, గియాతో విలాసవంతమైన జీవనం గడుపుతోంది. 7 సంవత్సరాల తర్వాత ఆమె బాలీవుడ్‌లోకి “లాహోర్ 1947” చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తోంది. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ నటిస్తున్నాడు. ఈ పాత్రకు ఆమె రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

ప్రీతి జింటా సినిమా రంగం నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, తన సామర్థ్యంతో అద్భుత విజయాలు సాధిస్తూ, అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment