గర్భిణిపై దాడి కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుడు జనసేన కార్యకర్త

గర్భిణిపై దాడి కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుడు జనసేన కార్యకర్త

ప్ర‌తీది మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ (Former CM Y.S. Jagan Mohan Reddy)పై తోసేయాలి, వైసీపీని బ‌ద్నాం చేయాల‌నే అధికార పార్టీ అనుకూల మీడియా ప్ర‌య‌త్నం భారీగా బెడిసికొట్టింది. శ్రీసత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టించిన గర్భిణి (Pregnant woman)పై దాడి కేసులో కీలక మలుపు తిరిగింది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై దాడి చేసిన అజయ్ దేవ్ (Ajay Dev) జ‌న‌సేన (Jana Sena Party) యాక్టివ్ కార్య‌క‌ర్త అని ఆ పార్టీ శ్రేణులు అంగీక‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మొదట ఈ కేసును వైసీపీ వైపున‌కు మళ్లించేందుకు కొన్ని మీడియా ఛానెళ్లు ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ, అత‌ను జ‌నసేన కార్య‌క‌ర్త అని తాజాగా కీల‌క ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి ఘటనలో నిందితుడిగా గుర్తించిన అజయ్ దేవ్ త‌మ‌ పార్టీ కార్యకర్తేనని స్థానిక జనసేన ఎంపీటీసీ అమర్(Jana Sena MPTC Amar) బహిరంగంగా అంగీకరించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే ఘటన జరిగిన వెంటనే అజయ్‌ను వైసీపీ కార్యకర్తగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేకంగా అధికార పార్టీ అనుకూల‌ మీడియా వర్గాలు అజయ్ దేవ్‌ను వైసీపీ కార్యకర్తగా పేర్కొంటూ అబద్ధపు ప్రచారం చేశాయని ఆ పార్టీ నేత‌లు మండిపడుతున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మిన కదిరి పోలీసులు, ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తో అజయ్‌ను వైసీపీ కార్యకర్తగా భావించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడిన నిందితుడిని కదిరి పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమాని అంటూ అజయ్ దేవ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉండగా, నిందితుడు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ అజ‌య్‌పై ఫిర్యాదు చేసిన గ‌ర్భిణీ ఇత‌నికి దాయాదుల‌ని, త‌న తండ్రిని తిట్టింద‌న్న కోపంతో ఆమెను అజ‌య్ తోసేశాడ‌ని స్థానికులు చెబుతున్నారు. గ‌ర్భిణీని అజ‌య్ త‌న్నాడ‌న్న ప్ర‌చారం అవాస్తవం అని అంటున్నారు. ఈ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. వాస్త‌వాల‌పై వాక‌బు చేయ‌కుండా తెలుసుకోకుండా, 30 ఇళ్లు ఉన్న గ్రామానికి డీఎస్పీ స్థాయి అధికారి వెళ్లి అజ‌య్‌ని అరెస్టు చేసి, క‌నీస విచార‌ణ చేయ‌కుండా థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. నాయ‌కుల ఆదేశాలు పాటించే ముందు క‌నీస విచార‌ణ చేస్తే వాస్త‌వాలు తెలిసేవ‌న్న అభిప్రాయాలు వెల్ల‌డ‌వుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment