‘బిహార్‌లో నీకేం పని’.. సీఎం రేవంత్‌పై పీకే ఫైర్

‘బిహార్‌లో నీకేం పని’.. సీఎం రేవంత్‌పై పీకే ఫైర్

బిహార్‌ (Bihar) రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై జ‌న్ సూర‌జ్ (Jan Suraj) ఫౌండ‌ర్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) (PK) ఘాటు విమర్శలు చేశారు. రేవంత్‌ బిహార్‌లో ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీకే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

“అసలు రేవంత్ రెడ్డి ఎవరు? బిహార్‌లో ఆయనకు ఏమి పని? ఎన్నికల సమయంలో బిహార్ ప్రజలను అవమానించిన వ్యక్తి ఇప్పుడు అదే ప్రజల వద్ద ఓట్లు అడగడానికి వస్తున్నారు. గ్రామాల్లోకి వస్తే ప్రజలు కర్రలతో తరిమేస్తారు” అంటూ ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఇదే సందర్భంలో పీకే కాంగ్రెస్ పార్టీ (Congress Party), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రధాని (Prime Minister) మోడీ (Modi)లను కూడా టార్గెట్‌ చేశారు. “బిహార్‌ను అవమానించడం కాంగ్రెస్ నేతలకు అలవాటు. ఇది రాహుల్ గాంధీ మనస్తత్వానికి ప్రతిబింబం. ఓట్ల చోరీ అంటూ రాహుల్ ఆరోపిస్తే, తప్పుడు ఆరోపణలంటూ మోడీ స్పందిస్తున్నారు. కానీ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇద్దరూ ఈ నాటకం ఆడుతున్నారు” అని వ్యాఖ్యానించారు. పీకే చేసిన ఈ వ్యాఖ్యలు బిహార్‌ రాజకీయాల్లో మంటలు రాజేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment