కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లు(Bill)లో భాగంగా క్రిమినల్ కేసు (Criminal Case)ల్లో అరెస్టై 30 రోజులు జైలులో ఉంటే పీఎం (PM), సీఎంల (CMs’) పదవులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి అనే నిబంధన చేర్చడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేసిన ట్వీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రకాశ్ రాజ్ చిలిపి సందేహం
“మహాప్రభు… తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక, మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, ‘మీ మాట వినె ఉపముఖ్యమంత్రిని’ ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా??? #justasking” అని ప్రకాశ్ రాజ్ తెలుగులో ట్వీట్ చేశారు. ఆయన ఈ ట్వీట్‌ను ప్రత్యేకంగా తెలుగు భాషలో చేయడం గమనార్హం. దీంతో ఇది నేరుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
నెటిజన్లలో చర్చ
ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురించే అని సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. బిహార్ ఎన్నికల తరువాత చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపిస్తున్న తరుణంలో.. ఒకవేళ కేంద్రంతో విభేదిస్తే, పాత కేసులు తెరపైకి తీసుకువచ్చి చంద్రబాబును జైలులో పెట్టే అవకాశం ఉందా? అలా జరిగితే, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయాలనే ప్లాన్ ఉందా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజకీయ వేడి
ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో ఎన్డీయే భవిష్యత్తు, చంద్రబాబు (Chandrababu)–పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంబంధాలపై చర్చ నడుస్తుండగా, ప్రకాశ్ రాజ్ ట్వీట్ ఆ వేడిని మరింత పెంచింది. ఆయన ఉద్దేశం ఏంటన్నది స్పష్టత రాకపోయినా, ట్వీట్ చేసిన భాష, టైమింగ్.. ఇది ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా సంబంధమున్నదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.







