ప్రకాశం జిల్లా (Prakasam District)లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రహదారి రక్తసిక్తమైంది. ప్రయాణికుల కుటుంబాల్లో విషాదంగా నింపింది. కొమరోలు మండలం (Komarole Mandal) పరిధిలో తాడిచర్లమోటు (Tadicharlamotu) వద్ద జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రయాణంలో ఉన్న కారు, లారీ ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం ప్రకారం, మృతులంతా మహానంది (Mahanandi) దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతులు బాపట్ల జిల్లా (Bapatla District)లోని స్టూవర్టుపురం (Stuartpuram) ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.
ప్రస్తుతం ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబ సభ్యులపై విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రజలు రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.