అమితాబ్‌కు 83వ పుట్టినరోజు..’ హీరో ప్రభాస్ స్పెషల్ విషెస్

అమితాబ్‌కు 83వ పుట్టినరోజు..' హీరో ప్రభాస్ స్పెషల్ విషెస్

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈరోజు (అక్టోబర్ 11) తన 83వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బిగ్ బీకి బర్త్‌డే విషెస్ (Birthday Wishes) తెలిపారుల‌.

“మీ పక్కనే ఉండి మీ పనితీరును చూడడం, మీతో కలిసి స్క్రీన్‌ను పంచుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి” అంటూ ప్రభాస్ ఆకాంక్షించారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గత ఏడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో అమితాబ్ ‘అశ్వత్థామ’గా, ప్రభాస్ ‘భైరవ’గా నటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ బ్లాక్‌బస్టర్ సినిమా సీక్వెల్ ‘కల్కి 2’ పనులు కొనసాగుతుండగా, ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే దీపికా పదుకొణెను వైజయంతి మూవీస్ తొలగించినట్లు వార్తలు రాగా, ఆమె పాత్రలో బాలీవుడ్ నటి అలియా భట్ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పుకార్ల నడుమ, బిగ్ బీకి ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పడం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment