ప్రభాస్ ‘స్పిరిట్’లో మ‌రో హీరో

ప్రభాస్ 'స్పిరిట్'లో మ‌రో హీరో

ప్రభాస్ (Prabhas) తాజా సినిమా ‘స్పిరిట్ (Spirit) ‘కు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు (Malayalam Actor) ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశాలున్నాయి. ‘మార్కో’ చిత్రంతో ఇటీవల మంచి హిట్ అందుకున్న ఉన్నిని, స్పిరిట్ చిత్ర బృందం కీలక పాత్ర కోసం సంప్రదించిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇప్పటివరకు మూవీ టీమ్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ప్రభాస్ ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్‌ పోలీస్ అధికారిగా కనిపించనున్నారన్న విషయం మాత్రం ఇప్పటికే వైరల్ అయింది. అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment