రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అంటే ఒక బ్రాండ్. తెలుగు సినిమాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన వారిలో ప్రభాస్ ఒకడు. వరుస యాక్షన్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవల ఓ మూవీ టీమ్‌లో సరదగా సంభాషణ జరిపాడు. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. వాస్తవానికి ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ప్రభాస్‌కు ఒకానొక టైమ్‌లో ప్రేమలో పడాలనిపించిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా రివీల్ చేశాడు.
ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా చూసినప్పుడు ప్రేమలో పడాలనిపించిందని చెప్పాడు. సంతోష్ శోభన్ (Santosh Shobhan) కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తనకు ‘గీతాంజలి’ (Geethanjali) సినిమా అంటే చాలా ఇష్టమని వెల్లడించిన ప్రభాస్.. “గీతాంజలి”, ‘ఏమాయ చేసావె’ సినిమా చూసినప్పుడు తనకు ప్రేమలో పడాలనిపించిందన్నాడు. తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) చూసినప్పుడూ అదే అనుభూతి కలిగిందని తెలిపాడు. అంతే కాదు.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్ చేసిన ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను ప్రభాస్ పంచుకున్నాడు.
ఇక ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నెల్లూరుకు చెందిన శివ (సంతోష్ శోభన్) ఒక స్ట్రగ్లింగ్ ఇంటీరియర్ డిజైనర్. ఖాళీగా తిరుగుతున్నాడనే తండ్రి కోపం, ప్రేయసి బ్రేకప్ చెప్పడం లాంటి పరిస్థితుల్లో తన అదృష్టాన్ని వెతుక్కుంటూ చెన్నైకి చేరుకుంటాడు. అక్కడ కష్టాల్లో ఉన్న అతనికి మిత్ర (మానస వారణాసి) పరిచయమవుతుంది. పరిస్థితుల ప్రభావంతో వీరిద్దరూ ఒకే రూమ్‌లో కూడా ఉండాల్సి వస్తుంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని ప్రారంభిస్తారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో మిత్ర జీవితంలో ఒక ఊహించని మలుపు ఎదురవుతుంది. ఆ సమస్య ఏమిటి? శివ దాన్ని ఎలా స్వీకరించాడు? అనేదే మిగతా కథ. ఈ సినిమా ప్రభాస్‌కు తెగ నచ్చేసిందట.








