పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పేరుతో ఓ ఊరు ఉందని మీకు తెలుసా? అవును నిజంగానే. నేపాల్(Nepal) లో ‘ప్రభాస్’ అనే గ్రామం ఉంది. ఓ తెలుగు మోటో వ్లాగర్ తన నేపాల్ పర్యటనలో ఈ ఊరిని, ఊరు పేరుని చూసి ఆశ్చర్యపోయాడు.
ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసిన ఆయన, “డార్లింగ్” పేరుతో ఓ ఊరు కనిపించిందంటూ వీడియో చేశాడు. అయితే, ఈ ఊరి పేరు ప్రముఖ నటుడు ప్రభాస్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకుముందు క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేర్లతో రైల్వే స్టేషన్లు ఉన్నాయన్న విషయం తెలిసిందే. మరి, ప్రభాస్ పేరు కూడా ఇలాగే ప్రాచుర్యం పొందుతుందేమో చూడాలి.