ప్రభాస్‌కు గాయం.. టీమ్ క్లారిటీ

ప్రభాస్‌కు గాయం.. టీమ్ క్లారిటీ

Summarize with AI

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాలికి గాయమైందని, దానికి సర్జరీ కూడా జరిగిందనే విషయం గత రెండు రోజుల నుంచి వైరల్ గా మారుతోంది. కొద్ది రోజుల పాటు షూటింగ్స్‌కి దూరంగా ఉంటారని వార్తలు వెల్ల‌డ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం చేతిలో ఉన్న సినిమాల‌న్నింటికీ ప్ర‌భాస్ తాత్కాలిక బ్రేక్ ఇచ్చేశార‌ని, డాక్ట‌ర్ల సూచ‌న‌ల మేర‌కు విశ్రాంతి తీసుకుంటూ గాయం నుంచి కొలుకుంటున్నార‌న్న న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అయితే, దీనిపై ప్రభాస్ టీమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఆయన గాయపడలేదని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరింది. కొన్ని వెబ్‌సైట్లు ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడిపోయారని, తీవ్ర గాయాలతో ఇటలీలో చికిత్స పొందుతున్నారని వార్తలు ప్రచురించాయి. కానీ ఇవన్నీ అసత్య ప్రచారాలని క్లారిటీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment