పాకిస్తానీ రూమ‌ర్ల‌పై ప్రభాస్ ‘ఫౌజీ’ హీరోయిన్‌ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్‌ పాకిస్తానీ.. ఇమ‌న్వి స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ఫౌజీ (Fauji) సినిమా హీరోయిన్ ఇమాన్వి (Imanvi) పాకిస్తాన్ (Pakistan) అమ్మాయి అని, ఆ సినిమా ని బ్యాన్ (Ban) చేయాలి అని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇమన్వి స్పందించారు. త‌న‌పై, త‌న కుటుంబంపై జ‌రుగుతున్న ప్ర‌చారంపై హీరోయిన్ స్వ‌యంగా స్పందిస్తూ.. ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పహల్గామ్‌ (Pahalgam) లో జరిగిన విషాద సంఘటన పట్ల హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని ప్ర‌క‌టించిన ఇమ‌న్వి.. హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు.

త‌న‌ గురించి, త‌న కుటుంబం గురించి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని చెప్పారు. త‌న‌ కుటుంబంలో ఎవరూ పాకిస్తానీ మిలిటరీతో సంబంధం కలిగి లేరన్నారు. త‌న‌పై అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేస్తున్నార‌ని, తాను హిందీ, తెలుగు, గుజరాతీ మరియు ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్ అని గ‌ర్వంగా చెప్పుకున్నారు ఇమ‌న్వి.

వార్తా సంస్థలు, జర్నలిస్టులు, సోషల్ మీడియాలో ఉన్న మేధావులు సైతం త‌మ కుటుంబం మూలాల గురించి క‌నీస ఎంక్వైరీ చేయ‌కుండా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం నిరుత్సాహాన్ని క‌లిగింద‌న్నారు. తాను లాస్ ఏంజిల్స్‌ (Los Angeles), కాలిఫోర్నియా (California) లో జ‌న్మించాన‌ని, త‌న‌ తల్లిదండ్రులు చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌కు భార‌త్ నుంచి వలస వచ్చారని చెప్పారు. USAలో చ‌దువు పూర్తి చేసిన త‌రువాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా మరియు డ్యాన్స‌ర్‌గా కళారంగంలో వృత్తిని కొనసాగించానని ఇమ‌న్వి చెప్పారు. తన‌ రక్తంలో భారతీయ గుర్తింపు, సంస్కృతిని కలిగి ఉన్నాన‌ని ఇమ‌న్వి స్ప‌ష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment