ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి నేడు గుంటూరు జైలు నుంచి విడుదల కానున్నారు. సీఐడీ కేసులో గుంటూరు కోర్టు ఆయనకు నిన్న సాయంత్రం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, మరికొన్ని గంటల్లో పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
నెలరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 18 కేసులు నమోదు చేశారు. ఏళ్ల క్రితం పవన్, చంద్రబాబును దూషించారన్న కారణంతో గత నెల ఫిబ్రవరిలో జనసేన, టీడీపీ నేతలు పోసానిపై వరుసగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పిటీ వారెంట్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్లకు తిప్పారు. ఆరోగ్య సమస్యలతో పోసాని జడ్జి ముందు కన్నీరు పెట్టుకున్న విషయమూ తెలిసిందే. చివరకు సీఐడీ కేసులో గుంటూరు కోర్టు పోసానికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో ఎట్టకేలకు ఆయన విడుదల ఖరారైంది.