---Advertisement---

ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ

ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ
---Advertisement---

ఈనెల 29న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టంతా మోదీ ర్యాలీపైనే ఉంది. ఇప్పటికే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించి, ఇంటింటా ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించి, ఉచిత హామీలను కూడా ప్రజలకు ఇచ్చింది. ఈ దశలో కాంగ్రెస్ కూడా సన్నద్ధమవుతోంది. మరోవైపు, బీజేపీ ఈసారి ఢిల్లీ రాజధానిలో అధికారాన్ని సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

వచ్చే నెలలో షెడ్యూల్‌..
ఢిల్లీ ప్రభుత్వ ప‌రిపాల‌న కాలం ఫిబ్రవరి వరకు ఉంది. అందువల్ల జనవరి 6న కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనుంది. మరి ఈ సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావొచ్చని తెలుస్తోంది. జనవరి నెలాఖరులోనే ఈ ఎన్నికలు జరగవచ్చు.

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో, విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. అదికాకుండా, ఆప్ పరిపాలనపై కాంగ్రెస్ ఇటీవలే వైట్ పేపర్ విడుదల చేసింది. హామీల అమలు లేకపోవడంపై కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈసారి ఢిల్లీలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య గొడవలు మరింత పెరగవచ్చు. మూడు పార్టీల మధ్య పోటీ ఉత్కంఠగా మారిపోతుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment