కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందజేస్తోంది. చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో ఆర్థిక భరోసా కలిగించడమే ఈ పథకం ఉద్దేశం. ఏడాదికి మూడు విడతలుగా రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతుంది.
నిధులు ఎప్పుడు జమ..
గత అక్టోబర్ 5న 18వ విడత నిధులు జమ చేయబడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు 19వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదలకు సమయం ఆసన్నమైంది. 2025 ఫిబ్రవరి మొదటి వారంలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
- లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలి?
- PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో Beneficiary Status పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయండి.
- మీ నిధుల జమ స్టేటస్‌ను చూడవచ్చు.
కొత్తగా దరఖాస్తు ఎలా చేయాలి?
రైతులు కొత్తగా PM కిసాన్ పథకానికి ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. https://pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి New Farmer Registration పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ సమాచారం, జిల్లా, రాష్ట్ర వివరాలను నమోదు చేసి ఫారం సబ్మిట్ చేయండి. సమర్పించిన దరఖాస్తు స్థానిక అధికారులచే ధృవీకరించబడిన తర్వాత ఆమోదం పొందుతుంది.