వాహ‌న‌దారుల‌కు షాక్‌.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

వాహ‌న‌దారుల‌కు షాక్‌.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

వాహ‌న‌దారుల‌కు (Vehicle Owners) కేంద్ర‌ప్ర‌భుత్వం (Central Government) పెద్ద షాకిచ్చింది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు పెంచుతున్న‌ట్లుగా (Increased) ప్ర‌క‌టించింది. ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇంధ‌నం రేట్లు పెంపు నిర్ణ‌యం తీసుకొని వాహ‌న‌దారుల‌కు షాక్ ఇచ్చింది. ఈ పెంపు ఫలితంగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.2 చొప్పున ధరలు పెరుగుతాయి. కొత్త ధరలు ఈ రోజు అర్ధరాత్రి (Midnight) నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు వాహనదారులు అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావ‌స‌ర ధ‌ర‌లు, రోజువారీ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయంతో రవాణా ఖర్చులు (Transportation Costs) పెరిగి వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశముందంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment