ప‌వ‌న్ ఐడియాలజీ జనసైనికుల‌కే అర్థం కాలేదు – పేర్ని నాని సెటైర్లు

ప‌వ‌న్ ఐడియాలజీ జనసైనికుల‌కే అర్థం కాలేదు - పేర్ని నాని సెటైర్లు

జనసేన పార్టీ (Janasena Party) స్థాపించి 11 ఏళ్లు అయినా రాష్ట్రానికి ఏ మేలు జరగలేదని వైసీపీ(YSRCP) కృష్ణా జిల్లా (Krishna District) అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (Perni Venkatramayya) (నాని) తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లి (Tadepalli)లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కులం, మతం, రాజకీయాల్లో అవసరాన్ని బట్టి త‌న వైఖరి మార్చుకుంటారని ఆరోపించారు. దీంతో ఆయన ఐడియాలజీ (Ideology), ప్రాగ్మిటిజమ్ (Pragmatism) జ‌న‌సేన‌ కార్యకర్తలే (Janasena Workers) అర్థం చేసుకోలేక సతమతమవుతున్నారని నాని వ్యాఖ్యానించారు.

సుగాలి ప్రీతి (Sugali Preeti) హత్య కేసు (Murder Case)పై పవన్ కళ్యాణ్ వైఖరిని కూడా పేర్ని నాని నిలదీశారు. ”వాస్తవానికి 2017 ఆగష్టులో సుగాలి ప్రీతిని హతమార్చారు. ఆ కేసులో స్కూల్ కరస్పాండెంట్ (School Correspondent), మిగిలిన నిందితులను సెప్టంబరులో అరెస్టు చేస్తే.. అదే ఏడాది అక్టోబరులో వారికి బెయిల్ వచ్చింది. సంఘటనా స్థలంలో ఆధారాలు, డీఎన్ఏ ముద్దాయిలతో సరిపోలడం లేదని విడిచిపెట్టారు. ప‌వ‌న్‌ ఆ రోజు ఏం మాట్లాడకుండా ఎన్నికల ప్రచారంలో వంద రోజుల్లో సీబీఐ విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వమే సాక్ష్యాలు తారుమారు చేసిందని ఆరోపించడం దారుణం” అని పేర్ని నాని మండిప‌డ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కుటుంబానికి భూమి, ఇల్లు, ఉద్యోగం కల్పించిందని ఆయన గుర్తు చేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakha Steel Industry) విషయంలోనూ పవన్ కళ్యాణ్‌ను పేర్ని నాని (Perni Nani) నిలదీశారు. కేంద్రంలో బీజేపీ(BJP) భాగస్వామిగా ఉన్నప్పటికీ, మోదీ(Modi)–అమిత్ షా(Amit Shah)లను ఒప్పించలేకపోయారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్టీల్ ప్లాంట్‌లో వేలాది ఉద్యోగులు కోల్పోయారని వివరించారు. “ప్రైవేటీకరణను ఆపామంటూ మాటలు చెప్పడం మోసం తప్ప మరేమీ కాదు” అని నాని తీవ్రంగా విమర్శించారు.

రైతుల సమస్యల విషయంలోనూ పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రశ్నించిన నాని, యూరియా కొరత, విత్తనాల బ్లాక్‌ మార్కెట్ వంటి అంశాలపై ఆయన స్పందించలేదని మండిపడ్డారు. “దసరా సందర్భంలో రోడ్డెక్కమని పిలిచే బదులు, రైతుల కోసం పోరాడితే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. 11 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటో మీరు మీరే ప్రశ్నించుకోవాలి” అని నాని సవాల్ విసిరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment