పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజిత్(Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ'(OG) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్తూరు జిల్లాలోని పవన్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 25న రాఘవ్ థియేటర్ (Raghav Theatre)లో విడుదల కానున్న ‘ఓజీ’ సినిమా మొదటి టికెట్‌ను శ్రీరామ్ లోచన్ (Sriram Lochan) అనే పవన్ అభిమాని ఏకంగా లక్ష రూపాయలకు కొనుగోలు చేశారు. ఆ డబ్బును థియేటర్ యాజమాన్యం పవన్ కళ్యాణ్ కార్యాలయానికి పంపించింది.
ఇక ‘ఓజీ’ విడుదల సందర్భంగా ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇప్పటికే టికెట్ ధరలు, ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెన్‌ఫిట్ షో టికెట్ ధర ఏకంగా రూ.1000గా నిర్ణయించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కూడా ప్రీమియర్స్ (Premieres)కి అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచే అవకాశం కల్పించింది. తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల ధరలతో పోల్చితే ఏపీలో అధికం.
ఈ సినిమాకు తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. పవన్ పవర్‌ఫుల్ లుక్‌తో, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ‘ఓజీ’ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.







