పవన్ అధికార దుర్వినియోగం.. హైకోర్టులో కీలక వాదనలు

పవన్ అధికార దుర్వినియోగం.. హైకోర్టులో కీలక వాదనలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అధికార దుర్వినియోగం ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు చేసిన వాదనల ప్రకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను న‌టించిన సినిమా హరిహర వీర మల్లు కోసం తన అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పదవిలో ఉన్న మంత్రులు ఇలా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.

ఇక మంత్రులు తమ పదవిని వ్యక్తిగత లాభాలకు వాడుకుంటే ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందని, రేపు ఇతర మంత్రులు కూడా ఇదే విధంగా తమ స్వవ్యాపారాలకు పదవిని వాడుకుంటే పరిపాలనా వ్యవస్థ బలహీనమవుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment