వినాయక చవితికి పవన్ దూరం.. సర్వత్రా విమర్శలు

వినాయక చవితికి డిప్యూటీ సీఎం దూరం.. సర్వత్రా విమర్శలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం (Deputy CM), జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వినాయక చవితి (Vinayaka Chavithi) పూజల్లో (Prayers) పాల్గొనకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుప‌తి (Tirupati) వేదిక‌గా సనాతన ధర్మ (Sanatana Dharma) పరిరక్షకుడిగా తనను తాను అభివర్ణించుకున్న పవన్, ఆదిదేవుడు గణనాథుడి పూజలకు దూరంగా ఉండడంపై పవర్ స్టార్ అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ (Twitter Handle) ద్వారా కనీసం తెలుగు ప్రజలకు (Telugu People) శుభాకాంక్షలు (Greetings) తెలపకపోవడం, గ‌ణేషునికి దండం పెడుతున్న ఒక్క ఫొటో కూడా విడుద‌ల‌ చేయకపోవడం అభిమానుల‌ ఆగ్రహానికి కారణమైంది.

అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో ప‌లు ద‌ఫాల్లో కాషాయం ధ‌రించి ఫ‌క్తు హిందుత్వ వాదిగా ద‌ర్శ‌నిమిచ్చిన ప‌వ‌న్‌.. విఘ్నేశ్వ‌రుడి తొలి పూజ‌ల్లో పాల్గొన‌క‌పోవ‌డం జ‌న‌సేన నేత‌ల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. క‌నీసం ట్వీట్ కూడా చేయ‌క‌పోవ‌డం ఫ్యాన్స్‌ను ఆలోచింప‌జేస్తోంది. ఇటీవల 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈటీవీ, 50 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న బాలకృష్ణకు విషెస్ తెలిపిన పవన్, గణేష్ చతుర్థి సందర్భంగా మాత్రం మౌనం వహించడంపై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. తొలి పూజకు దూరంగా ఉండేంత పనేంటి అన్న ప్రశ్నను అభిమానులు, నెటిజన్లు లేవనెత్తుతున్నారు.

ఈ అంశం సోషల్ మీడియాలో వేడెక్కుతోంది. పవన్ చేసిన పనిని కప్పిపుచ్చుకునేందుకు జనసేన కేడర్ తీవ్ర ఇబ్బందులు పడుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ అంశం ప్ర‌తిప‌క్ష వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు అస్త్రంగా మారింది. ఈ విష‌యాన్ని ఎత్తిచూపుతూ నెట్టింట ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. పంద్రాగ‌స్టు రోజున విష‌యం తెలియ‌క‌పోయినా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై హ‌డావిడిగా విమ‌ర్శ‌లు చేసిన జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. ఈ విష‌యంలో వైసీపీ నేతల నుంచి ప‌డుతున్న కౌంటర్లకు నోరుమెద‌ప‌లేక‌పోతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment