ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు త్వరలో ప్రమోషన్ రానుంది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడేందుకు, గెలుపునకు తమ నాయకుడు క్రియాశీలకంగా వ్యవహరించారని చెప్పుకుంటున్న జనసేన (Jana Sena) నేతలకు త్వరలోనే శుభవార్త అందనుంది. తమ నాయకుడిని గొప్ప హోదాలో చూడాలన్న జనసైనికుల చిరకాల కోరిక నెరవేరే సమయం దగ్గరపడుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదశ్ రాష్ట్రానికి ఇన్‌చార్జ్ (In-charge) ముఖ్యమంత్రి (Chief Minister)గా బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ నెల 26 నుంచి 30 వరకు విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, నారాయణ కూడా ఈ పర్యటనలో పాల్గొననున్నారు. వారం రోజుల పర్యటన నిమిత్తం సీఎం, ఆయన తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లనుండడంతో ఈ సమయంలో రాష్ట్ర పాలనలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు నాలుగు రోజుల పాటు పవన్ కల్యాణ్‌కు ఇన్‌చార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా సెట్స్ మీద ఉంది. ఇటు ప్రమోషన్స్, అటు షూటింగ్ షెడ్యూల్‌తో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే వ్యవహారాలతో సంబంధం లేకుండా పవన్ బిజీగా గడుపుతున్నారు. పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోస్ట్ ఆఫ్ ది టైమ్ హైదరాబాద్‌లోనే గడుపుతున్న పవన్‌కు.. షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చి వారం రోజుల పాటు ఏపీ వ్యవహారాలు చూసుకోవాల్సిందిగా పిలుపు అందినట్లుగా సమాచారం. 26వ తేదీలోగా ఇచ్చిన కాల్‌షీట్స్‌ను త్వరగా పూర్తిచేసుకునే పనిలో పడ్డారని, మళ్లీ వారం గ్యాప్ తరువాత రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొనేలా డేట్స్ సర్దుబాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు లోకేష్, నారాయణ సింగపూర్ పర్యటన వెళ్లనుండడంతో వారం రోజుల పాటు ఇన్‌చార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించనున్నారని జనసైనికులు సంబరపడిపోతున్నారు. తమ చిరకాల కోరిక త్వరలో నెరవేరనుందని ఎగిరి గంతేస్తున్నారు.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్