ప‌వ‌న్ ‘దిష్టి’ వ్యాఖ్య‌ల‌కు బీఆర్‌ఎస్ నేత కౌంట‌ర్‌ (Video)

ప‌వ‌న్ దిష్టి వ్యాఖ్య‌ల‌కు బీఆర్‌ఎస్ నేత స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ఏపీ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) చేసిన తాజాగా చేసిన వ్యాఖ్య‌లు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాన్ని సృష్టించాయి. కోనసీమలో కొబ్బ‌రి చెట్లు (Coconut Trees) ఎండిపోవడానికి “తెలంగాణ (Telangana) వాళ్ల దిష్టి త‌గిలింది” అని పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాసుల‌కు కోపాన్ని తెప్పిస్తున్నాయి. ఈ వ్యాఖ్యపై బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, “మా దిష్టి వాళ్లకు తగలదు… ఇన్నేళ్లుగా వారి దిష్టి తెలంగాణ అభివృద్ధికి తగిలింది” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. అంతేకాక పవన్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ “మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు” అని సెటైర్లు వేశారు. జ‌గ‌దీశ్‌రెడ్డి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ కారణాలు చెప్పకుండా “నర దిష్టి” వంటి మాటలు ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం సరికాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొబ్బరి చెట్లు ఎండిపోవడం వెనుక వాతావరణ మార్పులు, నీటి సమస్యలు వంటి అంశాలు ఉన్నప్పుడు దానిని రాజకీయంగా మలచడం ప్రజలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు.

ఇక తెలంగాణ వాదులు కూడా పవన్‌పై ప్రశ్నలు సంధిస్తున్నారు. “పవన్ కళ్యాణ్ అసలు నివసించేది ఎక్కడ? వీకెండ్‌కి ఎందుకు హైదరాబాద్ (Hyderabad) వస్తున్నారు?” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ – తెలంగాణ మధ్య రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ రేపుతున్న ఈ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల రాజకీయ నేతలు పరస్పరం ఆరోపణలు, ప్రతియరోపణలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment