‘నా యూరిన్‌ను బీర్‌లా తాగా’.. – న‌టుడు షాకింగ్ కామెంట్స్

నా యూరిన్‌ను బీర్‌లా తాగా.. - న‌టుడు షాకింగ్ కామెంట్స్

ప్రముఖ బాలీవుడ్ (Bollywood) నటుడు పరేశ్ రావల్ (Paresh Rawal) త‌న జీవితంలో ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌ల‌ను పంచుకున్నారు. ప‌రేశ్ చెప్పిన ఓ సంఘ‌ట‌న మాత్రం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఓ గాయం నుంచి కోలుకోవడానికి త‌న‌ యూరిన్ (Urine)ను తానే తాగినట్లు వెల్లడించారు.

పరేశ్ రావల్ మాట్లాడుతూ “ఒక సినిమా షూటింగ్ సమయంలో నా మోకాలి (Knee)కి తీవ్రంగా గాయం అయ్యింది. అనారోగ్యం నుంచి వెంట‌నే కోలుకోవాలంటే ప్రతి రోజు ఉదయం స్వీయ మూత్రాన్ని తాగాలని అజయ్ దేవగన్ (Ajay Devgn) తండ్రి వీరు దేవగన్ (Veeru Devgan) సూచించారు. నేను 15 రోజులపాటు నా యూరిన్‌ను బీర్లా తాగాను. నిజంగా అది పనిచేసింది. గాయం త్వరగా నయమైంది. డాక్టర్లకు కూడా ఇది ఆశ్చర్యం కలిగించింది” అని వివరించారు.

కాగా, ప‌రేశ్ రావల్ చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ షాక్‌కు గురిచేశాయి. ఎన్నో అధునాత‌న వైద్య స‌దుపాయాలు అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత కూడా ఇలాంటి ప‌ద్ధ‌తులు పాటించ‌డం ఏంట‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం డాక్ట‌ర్ల స‌ల‌హాలు పాటించాల‌ని సూచిస్తున్నారు. ప‌రేశ్ రావ‌ల్ వ్యాఖ్య‌లు మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment