పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లా (Hoshiarpur District) హాజీపూర్ (Hajipur) రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది (Eight People) అక్కడికక్కడే మృతిచెందారు (Died).
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ఉన్నారు. అందులో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
డ్రైవర్ బస్సును వేగంగా నడిపి నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బస్సు ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సు యాత్రికులతోపాటు మామూలు వేగంతో ప్రయాణిస్తున్నదని కొందరు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.







