---Advertisement---

పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్ర‌బాబు నిర్ణ‌య‌మేంటి..?

పల్లాకు మంత్రి పదవి దక్కనుందా?.. చంద్ర‌బాబు నిర్ణ‌య‌మేంటి..?
---Advertisement---

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకురావడం ఖరారైంది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల మ‌ధ్య భేటీ కూడా జ‌రిగింది.

పల్లా శ్రీ‌నివాస‌రావుకు మంత్రి పదవి కేటాయించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం కేబినెట్‌లో ఉన్న ఒక మంత్రిపై వేటు వేయబోతున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో ప్రభావం చూపించలేకపోతున్న ఇతర మంత్రులను కూడా బయటకు పంపి, కొత్తవారికి అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే జ‌రిగితే..
అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు మాత్ర‌మే గ‌డిచింది. ఈ స్వ‌ల్ప కాలంలోనే మంత్రుల ప‌నితీరుపై కొల‌మానం పెట్ట‌డం, తొల‌గింపున‌కు పూనుకోవ‌డం అనే విష‌యంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌త వైసీపీ పాల‌న‌లో రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌కు మంత్రుల‌ను మార్చిన స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష టీడీపీ విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment