‘మా ప్రధాని పిరికిపంద.. ఆర్మీ చీఫ్ పేకాట రాయుడు’ -పాక్ ఎంపీ

‘మా ప్రధాని పిరికిపంద.. ఆర్మీ చీఫ్ పేకాట రాయుడు’ -పాక్ ఎంపీ

Summarize with AI

భారత్ (India), బలూచిస్థాన్ (Balochistan) లిబరేషన్ ఆర్మీ (Liberation Army) దాడులతో పాకిస్తాన్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్‌లోని నాయకులు తమ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా శుక్ర‌వారం పాక్ పార్లమెంటు (Pakistan Parliament) సమావేశంలో ఓ ఎంపీ (MP) రెచ్చిపోయి మాట్లాడారు. దేశం యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రధాని (PM), ఆర్మీ చీఫ్ (Army Chief) బాధ్యతల నుంచి పారిపోతున్నారని ఆరోపిస్తూ బూతులతో తిట్టారు. ‘‘పిరికిపందల్లా దాక్కుంటున్నారే మేము ఎలా నమ్మాలి?’ అంటూ విమర్శలతో విరుచుకుపడ్డారు.

పాకిస్తాన్ ప్ర‌ధాని పిరికిపంద‌ (Coward), ఆర్మీ చీఫ్ పేకాడ రాయుడు అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా స‌మాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో వైరల్‌గా మారింది. దేశాన్ని రక్షించాల్సిన నేతలే దాక్కుంటే ప్రజల పరిస్థితి ఏంటి అనే చర్చ నెట్టింట జరుగుతోంది.

ఇదిలా ఉండ‌గా, పాకిస్తాన్‌పై ముప్పెట దాడి జ‌రుగుతోంది. ఒక‌వైపు నుంచి భార‌త్ మిస్సైళ్ల వ‌ర్షం కురిపిస్తుండ‌గా, మ‌రోవైపు నుంచి బ‌లూచిస్తాన్ బాంబుల దాడి చేస్తోంది. ఇంకోవైపు నుంచి స్టాక్ మార్కెట్ల ప‌త‌నంతో పాక్‌ను ఆర్థిక మాంద్యం వెంటాడే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment