పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్

పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్

పాకిస్తాన్ (Pakistan), ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) మధ్య యుద్ధం (War) తీవ్రమవుతోంది. ఈ రోజు తెల్లవారుజామున ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌ (Kabul)తో సహా పలు నగరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పుడు ఆఫ్ఘాన్ వంతు మొదలైంది. పాక్‌పై ప్రతీకార దాడులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌ (Islamabad) లోని పలు ప్రాంతాలపై డ్రోన్ అటాక్స్ జరిగినట్లు సమాచారం. ఆఫ్ఘాన్ వైమానిక దళం ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇస్లామాబాదో‌లో వైమానిక దాడి చేసినట్లు ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పట్టపగలు తాము పాక్‌పై దాడి చేసినట్లు తాలిబాన్లు పేర్కొన్నారు.

నివేదికల ప్రకారం, ఇస్లామాబాద్‌లోని ఫైజాబాద్ సిటీకి సమీపంలోని సైనిక శిబిరంపై ఆఫ్ఘాన్ వైమానిక దళం దాడి చేసింది. ఇదే కాకుండా నౌషేరా, ఖైబర్ ఫఖ్తు్ంఖ్వాలోని ఆర్మీ బ్యారక్స్, జామ్రుద్‌లోని ఒక సైనిక స్థావరాన్ని తాలిబాన్లు టార్గెట్ చేశారు. పాక్ ఆర్మీ కంటోన్మెంట్ ఉన్న అబోటాబాద్‌పై కూడా దాడులు జరిగాయి. కాబూల్, కాందహార్, పక్తియాలో పాక్ వైమానిక దాడులకు ఆఫ్ఘాన్ ప్రతీకారం తీర్చుకుంది.

ఇదిలా ఉంటే, ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని కార్యాలయం, నివాసానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇది ఆ దేశంలో సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ బోర్డర్ పోలీస్ ప్రతినిధి అబ్దుల్లా ఫారూఖీ తెలియజేశారు. ఈ దాడుల్ని పాక్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ కూడా ధ్రువీకరించారు. కానీ ఈ దాడులు విజయవంతం కాలేదని చెప్పారు. తాలిబాన్లు ప్రయోగించిన డ్రోన్లను, పాక్ డ్రోన్ రక్షణ వ్యవస్థ ఎదుర్కొన్నట్లు చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment