జమ్మూ (Jammu) ప్రాంతంలో మరోసారి పాకిస్తాన్ (Pakistan) జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు (Indian Soldier) వీరమరణం (Martyrdom) పొందారు. శుక్రవారం రాత్రి పాక్ జరిపిన కాల్పుల్లో 29 ఏళ్ల జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (Sachin Yadavrao Vananje) వీరమరణం పొందారు. దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన సచిన్ పార్థివదేహాన్ని శనివారం నాడు ఆయన స్వస్థలమైన మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దులో ఉన్న నాందేడ్ జిల్లా తమ్లూర్(Tamlur)కు తీసుకురానున్నట్లు సమాచారం.
సైనికుడిగా సేవలందించిన సచిన్ యాదవ్ రావు వనాంజేకు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, అధికారులు ఘన నివాళులు అర్పించనున్నారు. అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. ఈ ఘటన దేశం మొత్తం గుండెను పిండేసింది. సచిన్ వీరమరణం దేశభక్తికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిందని వీర జవాన్ బంధువులు, గ్రామస్తులు కొనియాడుతున్నారు.








