---Advertisement---

ప‌హ‌ల్గామా ఉగ్ర‌దాడి.. భ‌ర్త‌కు క‌న్నీటి వీడ్కోలు, వీడియో వైర‌ల్‌

---Advertisement---

జమ్మూకశ్మీర్‌ (Jammu & Kashmir)‌ లో హనీమూన్‌ వెళ్తూ జీవితంలో ఊహించని విషాదాన్ని ఎదుర్కొన్న ఓ యువతి దేశాన్ని కన్నీటి పర్యంతం చేసింది. పెళ్లై ఒక్క వారం కూడా కాలేదు. కానీ భర్త పార్థివ దేహానికి చివరిసారిగా తలవంచి, సెల్యూట్ చేస్తూ “జై హింద్” (Jai Hind) అంటూ గంభీరంగా నినదించి దేశంపై ప్రేమ వ్యక్తం చేసిన సంఘటన ఇప్పుడు దేశపౌరులను కంటతడి పెట్టిస్తుంది.

హర్యానా (Haryana) రాష్ట్రం కర్నాల్‌కు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (Lieutenant Vinay Narwal) ఈ నెల 16న హిమాన్షి నర్వాల్‌ (Himanshi Narwal) ను వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 19న రిసెప్షన్ నిర్వహించిన ఈ జంట, సోమవారం హనీమూన్ కోసం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం చేరుకున్నారు.

మంగళవారం, పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో బెల్‌పూరి తింటున్న సమయంలో.. ఓ ఉగ్రవాది (Terrorist) లెఫ్టినెంట్ నర్వాల్‌ను తలలో కాల్చాడు. ఆ ఘటన గురించి హిమాన్షి చెబుతూ వాపోయింది.
“మేము బెల్‌పూరి తింటూ ఉన్నాం.. అంతలోనే ఓ వ్యక్తి వచ్చి నా భర్తను కాల్చేశాడు. నా ముఖంపై రక్తం ఒక్కసారిగా కనిపించింది” అని ఆమె విలపించింది.

బుధవారం, లెఫ్టినెంట్ నర్వాల్ పార్థివదేహం ఢిల్లీకి (Delhi) తీసుకురాగానే, హిమాన్షి గట్టిగా ఏడుస్తూ, కాఫిన్‌ను ఆలింగనం చేసింది.
” ఆయన గర్వపడేలా మేము జీవిస్తాం” అని ఆమె కన్నీరు పెట్టుకుంది. తరువాత ఆమె కన్నీళ్లు తుడుచుకుని, నావికాధికారుల సమక్షంలో తలెత్తి నిలబడి, తన భర్తకు సెల్యూట్ చేసి “జై హింద్” అని గర్వంగా నినదించింది. ఆమె ధైర్యం చూసిన ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి లోనయ్యారు.

ఇది కేవలం ఒక ప్రేమకథ కాదు… దేశభక్తి, త్యాగం, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. లెఫ్టినెంట్ నర్వాల్ ఆత్మకు శాంతి కలగాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment