ఆస్కార్-2026.. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ క్లీన్ స్వీప్

ఆస్కార్-2026.. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ క్లీన్ స్వీప్

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ అకాడమీ అవార్డుల (Oscars 2026) వేడుక ఘనంగా జరిగింది. ఈ ఏడాది హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ తెరకెక్కించిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ (One Battle After Another) చిత్రం ఆస్కార్ వేదికపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా ఏకంగా 6 విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టి ఈ ఏడాది ‘బిగ్ విన్నర్’గా నిలిచింది.

ప్రధాన అవార్డుల విజేతలు
ఉత్తమ చిత్రం:
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ నటుడు: మైకేల్ బి జోర్డాన్ (సిన్నర్స్) – కవలలుగా నటించి ఆస్కార్ గెలిచిన తొలి నటుడిగా రికార్డు.
ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్) – ఉత్తమ నటిగా ఆస్కార్ గెలిచిన మొదటి ఐరిష్ నటి.
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్) – ఇది ఆయనకు మూడవ ఆస్కార్.
ఉత్తమ సహాయ నటి: ఎమీ మ్యాడిగన్ (వెపన్స్) – 75 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించారు.

‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రభంజనం
లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను కూడా భారీగా దక్కించుకుంది. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేగా పాల్ థామస్ ఆండర్సన్, బెస్ట్ కాస్టింగ్‌కు కస్సాండ్రా కులుకుండిస్ (ఈ ఏడాదే కొత్తగా ప్రవేశపెట్టిన కేటగిరీ), ఉత్తమ ఎడిటింగ్‌కు ఆండీ జుర్గెన్సెన్‌ను అవార్డులు వ‌రించాయి.

ఇతర ముఖ్య విజేతలు
ఒరిజినల్ స్క్రీన్ ప్లే:
ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్) – జోర్డాన్ పీలే తర్వాత ఈ అవార్డు గెలిచిన రెండో నల్లజాతీయుడు.
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కెపాప్ డిమోన్ హంటర్స్ (మ్యాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్, మిషెల్లీ వాంగ్)
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హూ క్రెడ్ పర్ట్స్
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ‘ది సింగర్స్’ మరియు ‘టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవా’ (రెండింటికీ సంయుక్తంగా)
కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్స్టెన్)
మేకప్ & హెయిర్ స్టైల్: మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యురే (ఫ్రాంకెన్స్టెన్)
విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ఫైర్ అండ్ యాష్

హైలైట్స్..
ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ‘సిన్నర్స్’ చిత్రం ఏకంగా 16 నామినేషన్లతో టైటానిక్ రికార్డును బ్రేక్ చేసింది. చివరకు 4 అవార్డులను (నటుడు, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, స్కోర్) దక్కించుకుంది. మైకేల్ బి జోర్డాన్ తన 25 ఏళ్ల కెరీర్‌లో మొదటిసారి ఆస్కార్ అందుకోవడం వేదికపై భావోద్వేగానికి గురిచేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment