‘ఆరెంజ్’ సినిమాలో రూబా పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ షాజన్ పదమ్సీ (Shazahn Padamsee) తన జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆమె ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో ఈ ఏడాది జూన్‌లో వివాహం (Wedding) జరగనున్నట్లు ప్రకటించారు.
ప్రేమలో రెండేళ్లు
షాజన్ పదమ్సీ ఇటీవల తన రోకా వేడుక (వివాహానికి ముందు జరిగే తంతు)కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆశిష్ కనకియాతో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు వెల్లడించిన ఆమె, వారి వివాహం ఈ జూన్‌లో జరగనున్నట్లు చెప్పారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలుగు సినిమాతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ షాజన్ తన నటనతో ఆకట్టుకున్నారు.