ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఈ ఆపరేషన్ ఇంకా ముగియలేదని, పూర్తిస్థాయిలో కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తమకు అప్పగించిన లక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆపరేషన్ గురించి విస్తరిస్తున్న ఊహాగానాలు, ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించారు. ఈ అంశంపై త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌కు తాత్కాలిక విరామం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ఇండియా-పాక్ చర్చల అనంతరం కాల్పుల విరమణ ప్రకటించబడినప్పటికీ, పాకిస్థాన్ తరఫు నుంచి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడం నేపథ్యంలో ఈ భద్రతా సమీక్ష సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితులపై, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోందని సమాచారం.
The Indian Air Force (IAF) has successfully executed its assigned tasks in Operation Sindoor, with precision and professionalism. Operations were conducted in a deliberate and discreet manner, aligned with National Objectives.
— Indian Air Force (@IAF_MCC) May 11, 2025
Since the Operations are still ongoing, a detailed…








