రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తాజా వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, న్యాయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీశాయి. ఇటీవల ఓ వేదికపై మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ కాలంలో తనను ఇబ్బందులకు గురి చేశారని, తన కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని, అయినప్పటికీ తాను భరించానని ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఎం. నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఎన్వీ రమణను ప్రశ్నించారు. “ఎన్వీ రమణ సాధారణ న్యాయమూర్తి కాదు.. దేశంలోని అత్యున్నత న్యాయ వ్యవస్థకు కీలక అధికారి. ఆయనను అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేసి ఉంటే, అది ఒక స్పష్టమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. రమణ అసమర్థుడా? లేక ఆయన అవినీతిపరుడా? లేకపోతే, ఆయన అప్పట్లో జగన్‌పై ఎందుకు చర్య తీసుకోలేదు..? ఇప్పుడు ఎందుకు ఎన్వీ రమణ ఏడుస్తున్నాడు?” అని ఎం. నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “జగన్ నిజంగా ఇబ్బంది పెట్టి ఉంటే, అప్పట్లో సీజేఐ హోదాలో ఉన్న ఎన్వీ రమణ చట్టబద్ధ చర్యలు ఎందుకు తీసుకోలేదు? తన కుటుంబంపై నమోదైన కేసుల గురించి మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు. పదవి వీడిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు?” అంటూ పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ఇబ్బందిపెట్టి ఉంటే ఆయనతో ఎందుకు సన్మానాలు చేయించుకున్నారు. జగన్‌ను ఆయన భార్యను విజయవాడ నోవాటెల్ హోటల్‌లో ఎందుకు కలిశారు? అని ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఎన్వీ రమణ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “సీటులో కూర్చోవడం గొప్ప కాదు, కూర్చుని ఏమి సాధించారన్నదే ముఖ్యం” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎన్వీ రమణ వ్యాఖ్యలతో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది.
Sri N V Ramana was no ordinary judge. He was the Chief Justice of India, the highest judicial authority in the country. If Jagan Mohan Reddy, then Chief Minister of Andhra Pradesh, targeted him, it raises a stark questions:
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) November 2, 2025
Was Ramana incompetent?
Or was he corrupt?
Or was he… pic.twitter.com/4cutcSWSfl








