నూజివీడు (Nuzvid) పోలీస్ స్టేషన్ (Police Station) వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నూజివీడు బాపునగర్‌కు చెందిన యువతి, యువకుడు పెద్దల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది.
భారీగా చేరుకున్న యువతి బంధువులు
వివాహం జరిగిందని తెలిసిన యువతి తరపు కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున నూజివీడు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ప్రేమజంటను చూసి ఆగ్రహంతో రెచ్చిపోయారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులను పక్కకు నెట్టేసి నేరుగా యువకుడిపై దాడికి దిగారు.
పోలీసుల సమక్షంలోనే యువతిని పెళ్లి చేసుకున్న యువకుడిని తీవ్రంగా కొట్టిన కుటుంబ సభ్యులు, స్టేషన్ వద్ద ఉద్రిక్తత సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వెంటనే స్టేషన్ గేట్లు, ప్రధాన తలుపులను మూసివేశారు. ప్రేమజంటను లోపలికి తీసుకెళ్లి రక్షణ కల్పించారు.
పోలీసులు గేట్లు మూసివేయడంతో అక్కడికి చేరిన ఇరుకుటుంబాల సభ్యులు ఆగ్రహంతో గేట్లను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించారు. గేట్లను ధ్వంసం చేసి స్టేషన్‌లోకి చొరబడేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. నూజివీడు స్టేషన్ వద్ద ఉద్రిక్తత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
— Telugu Feed (@Telugufeedsite) November 29, 2025
ప్రాణరక్షణ కోసం నూజివీడు పోలీసులను ఆశ్రించిన బాపునగర్‌కు చెందిన ప్రేమజంట
స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న యువతి తరపు బంధువులు
పోలీసులను పక్కకు నెట్టేసి ప్రేమ జంటపై దాడి
యువకుడిని చితకబాదిన యువతి కుటుంబ సభ్యులు
గేట్లు, స్టేషన్ తలుపులు… pic.twitter.com/p88L9SSnBb








