యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మరోసారి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లింది. ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ మరియు మలయాళ స్టార్ టోవినో థామస్ కనిపించనున్నట్లు సమాచారం.
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ జోర్డాన్‌లో పూర్తయింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, టోవినో థామస్ పాల్గొని హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక కొత్త షెడ్యూల్ ఈ వారం నుంచే ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా కోసం మూడు భారీ సెట్స్‌ను ప్రత్యేకంగా నిర్మించినట్లు తెలిసింది. అందులో విలన్ ఇంటి సెట్ కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సెట్స్‌లోనే దాదాపు నెల రోజులపాటు షూటింగ్ జరగనుందని సమాచారం.
ఈ షెడ్యూల్ పూర్తయ్యాక ‘డ్రాగన్’ టీమ్ తదుపరి షూటింగ్ కోసం శ్రీలంక కు వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ భారీ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ యర్ననేని, వై. రవి శంకర్, కోశరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంగీతాన్నిరవి బస్రూర్ అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది.








