టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ (Jr. NTR) ప్రస్తుతం జపాన్ (Japan) లో ఉన్నారు. గతేడాది విడుదలైన “దేవర” (Devara) ఈ నెల 28న జపాన్ థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు జరుగగా, వాటికి ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) హాజరయ్యారు. ఈ జపాన్ ట్రిప్‌ను వ్యక్తిగతంగా కూడా ప్రత్యేకంగా మార్చుకున్న తారక్ (Tarak), తన భార్య ప్రణతి (Pranathi) పుట్టినరోజును అక్కడే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన రెండు ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక, “అమ్మలు.. హ్యాపీ బర్త్ డే (“Ammalu… Happy Birthday”)” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జపాన్ నుంచి డైరెక్ట్‌గా ప్రశాంత్ నీల్ షూటింగ్ లో..
ప్రస్తుతం ఎన్టీఆర్ “దేవర” ప్రమోషన్‌తో బిజీగా ఉండగా, జపాన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక వెంటనే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి షెడ్యూల్ బెంగళూరు (Bengaluru) లో జరగనున్నట్లు సమాచారం.