---Advertisement---

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తెలుగు ఆటగాళ్లకు నిరాశ

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తెలుగు ఆటగాళ్లకు నిరాశ
---Advertisement---

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. పేస్ ఆల్‌రౌండర్ల ఎంపికలో సెలక్టర్లు హార్దిక్ పాండ్య వైపు మొగ్గు చూపడంతో నితీశ్‌కు అవకాశం దక్కలేదు. నితీశ్ ఆట‌తీరుపై సెల‌క్ట‌ర్లు సంతృప్తిగానే ఉన్న‌ప్ప‌టికీ అనుభ‌వం దృష్ట్యా పాండ్యాను ఎంపిక చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

మ‌రోవైపు పేసర్ మహ్మద్ సిరాజ్ మరియు బ్యాటర్ తిలక్ వర్మ కూడా జట్టులోకి ఎంపిక కాకపోవడం తెలుగు స్టేట్స్ క్రికెట్ అభిమానులకు మరో చేదు వార్త. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో తెలుగు ఆటగాళ్లు ప్రాతినిధ్యం లేకుండాపోవడం చర్చనీయాంశమైంది.

టీమిండియా జ‌ట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జ‌డేజాను ఎంపిక చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment