ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘తలైవన్ తలైవి’ చిత్రంతో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. ఈ సినిమాకు ముందు ఈ ఇద్దరు నటులు ప్లాప్‌లను చవిచూశారు. ముఖ్యంగా నిత్యామీనన్ విషయానికి వస్తే, ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘తిరుచిత్రాంబలం’ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని జయం రవితో కలిసి ‘కాదలిక్క నేరమిల్లే’ సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా నిరాశపరిచింది.
‘తలైవన్ తలైవి’తో సక్సెస్ ట్రాక్:
‘కాదలిక్క నేరమిల్లే’తో మిస్సైన లెక్కలను ‘తలైవన్ తలైవి’తో నిత్యా సరిచేసుకుంది. జూలై 25న తమిళంలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే తమిళంలో రూ. 30 కోట్లు వసూలు చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ఆగస్టు 1న ‘సార్ మేడమ్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘భీమ్లా నాయక్’ తర్వాత నిత్యా తెలుగులో పెద్దగా కనిపించలేదు. డబ్బింగ్ సినిమాలతోనే అప్పుడప్పుడు పలకరిస్తోంది.
నెక్స్ట్ టార్గెట్ దసరా, ధనుష్‌తో మరోసారి:
ఈ మలయాళీ ముద్దుగుమ్మ తన నెక్స్ట్ బిగ్ టార్గెట్‌ను దసరాకు ఫిక్స్ చేసింది. ధనుష్‌తో మరోసారి కలిసి బాక్సాఫీసును దొచుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ‘ఇడ్లీ కడాయ్’ అనే మరో డ్రామా ఫిల్మ్‌తో నిత్యా రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన మొదటి లిరికల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గత సంవత్సరం ప్రకటించిన రామ్ కామ్ మూవీ ‘డియర్ ఎక్సెస్’ ఆగిపోయిందని నిత్యామీనన్ స్పష్టం చేసిం