గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ప్రధాన పాత్రలో సరికొత్త మైథాలజీ థ్రిల్లర్ (Mythology Thriller) చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ‘వరాహ్ ఫిల్మ్స్’(Varah Films) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా(Production No.1) రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను సునీత్ పడోల్కర్ (Suneeth Padolkar) నిర్మిస్తుండగా, ‘తంత్ర’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి (Srinivas Gopishetty) తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పీ. అశోక్(P. Ashok), పీ. రేణుక (P. Renuka) కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హుర్మత్ సర్నా(Hurmath Sarna) ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
లాంచ్ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో నిధి అగర్వాల్ మునుపెన్నడూ చూడని సరికొత్త, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించి సర్ ప్రైజ్ చేశారు.
మైథాలజీ అంశాలను థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో మేళవించి, నిధి అగర్వాల్ పాత్రను అత్యంత బలంగా తీర్చిదిద్దుతూ దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి(Srinivas Gopishetty) ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.








