న్యూజిలాండ్‌లో భూకంపం.. 6.5 తీవ్రత

న్యూజిలాండ్‌లో భూకంపం.. 6.5 తీవ్రత

Summarize with AI

న్యూజిలాండ్‌లో మంగళవారం ఉదయం భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలోని రివర్టన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, తీవ్ర‌త 6.8 వరకు ఉండొచ్చని అంచనా. భూకంప కేంద్రం భూమికి పశ్చిమ నైరుతి దిశలో 159 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం రావడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని గమనిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో, మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment