మందుబాబుల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

మందుబాబుల‌కు ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది. డిసెంబ‌ర్ 31, 2025 జ‌న‌వ‌రి 1వ తేదీ రెండ్రోజులు మద్యం అమ్మకాల సమయాన్ని పెంచుతూ ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. నిబంధనల ప్ర‌కారం మద్యం షాపులు రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఓపెన్‌లో ఉంటాయి. కానీ, ఏడాది చివ‌రి రోజు, నూత‌న ఏడాది ప్రారంభం రోజున మద్యం షాపులు, బార్లు, క్లబ్‌లు, మరియు ఈవెంట్లలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. న్యూయ‌ర్ సంద‌ర్భంగా మ‌ద్యం విక్ర‌యాలు అధికంగా జ‌రుగుతాయ‌ని భావించి ప్ర‌భుత్వం.. రాత్రి 1 గంట వ‌ర‌కు అనుమ‌తిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతతో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment