చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్..

చైనాలో మంకీపాక్స్ కొత్త వేరియంట్..

ప్రపంచ దేశాల‌ను వ‌ణికించిన మంకీపాక్స్ వైరస్, ఇటీవల కొత్త వేరియంట్ ‘ఎంపాక్స్ క్లేడ్ ఐబి’తో కలకలం రేపుతోంది. చైనాలో, కాంగో నుండి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఈ వేరియంట్ వల్ల కాంగో ప్రయాణికుడితో సన్నిహితంగా ఉన్న నలుగురు వ్యక్తులకు కూడా వ్యాప్తి చెందింద‌ని తెలియజేశారు. కొత్త వేరియంట్‌ సోకిన రోగుల్లో చర్మంపై దద్దుర్లు, బొబ్బలు లక్షణాలు ఉన్నాయని గుర్తించారు.

మంకీపాక్స్ కొత్త వేరియంట్ ‘ఎంపాక్స్ క్లేడ్ ఐబి’ వ్యాప్తి కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగు దేశాలకు వ్యాపించింది. దీంతో డబ్ల్యూహెచ్‌ఓ సైతం తాజాగా, హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత ఆగస్ట్‌లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) నుంచి ఎంపాక్స్‌ ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది. కొత్త వేరియంట్‌ క్లాడ్‌ ఐబీ లైంగికంగా కలవడం వల్ల వేంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ తక్షణమైన చర్యలు అవసరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment