నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

నెల్లూరు జిల్లా (Nellore District) లో పెను విషాదం చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్‌లో వచ్చిన ఇసుక టిప్పర్ లారీ ఒక కారును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ ఢీకొట్టిన తర్వాత కారును కొంత దూరం ఈడ్చుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

కారు నుండి మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు, ఫైర్ శాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. మృతులు నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేట్ గుర్రం వారి వీధికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు తాళ్లూరు రాధ (38), శ్రీనివాసులు (40), సారమ్మ (40), వెంగయ్య (45), లక్ష్మి (30), డ్రైవర్‌గా గురించారు.

ఈ ఘటనపై వైసీపీ (YSRCP)  అధినేత వై.ఎస్. జగన్ (Y.S.Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జగన్, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment