నెల్లూరులో రాజకీయ ఉద్రిక్తత.. వెన‌క్కి త‌గ్గ‌ని నేత‌లు

నెల్లూరులో రాజకీయ ఉద్రిక్తత.. వెన‌క్కి త‌గ్గ‌ని నేత‌లు

నెల్లూరు (Nellore) జిల్లాలో వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar) ఇంటిపై జరిగిన దాడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనంగా మారింది. కోవూరు ఎమ్మెల్యే (Kovur MLA) వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (Vemireddy Prashanti Reddy)పై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ నాయకులు ఈ దాడిని కేవలం విధ్వంసం కాదని, ప్రసన్నకుమార్‌పై హత్యాయత్నంగా ఆరోపిస్తున్నారు. సావిత్రి నగర్‌ (Savitri Nagar)లోని ఆయన నివాసంలో ఫర్నిచర్ (Furniture), వాహనాలు (Vehicles), సీసీ కెమెరాలు (CCTV Cameras) ధ్వంసం చేయబడ్డాయి, ఆయన తల్లిని ఓ రూమ్‌లో బంధించి ఇళ్లంతా ధ్వంసం చేసిన‌ట్లుగా స్థానిక వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే ప్ర‌శాంతిపై చేసిన వ్యాఖ్య‌ల‌కు తాను క‌చ్చితంగా క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ప్రసన్నకుమార్ రెడ్డి, వాటిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రశాంతిరెడ్డి కోర్టుకు వెళ్లినా లేదా మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా తనకు అభ్యంతరం లేదని, అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా వచ్చినవని చెప్పారు.

మరోవైపు, ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడితో తమకు సంబంధం లేదని ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి మొదట చెప్పిన్నప్పటికీ, తర్వాత తమ అభిమానులు దాడి చేసి ఉండవచ్చని, అయితే వారెవరో తమకు తెలియదని, ఆ త‌రువాత‌ వెనక్కి రమ్మని చెప్పామని మాట మార్చారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ప్ర‌శ్నిస్తున్నారు. దాడికి చేసివారు “ఎవరో తెలియకపోతే ఎలా వెనక్కి పిలిచారు?” అని నిలదీశారు.

నెల్లూరు ఎస్పీ కార్యాలయం (SP office) వద్ద మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఈ వివాదంపై హైడ్రామాగా మారింది. ప్రసన్నకుమార్ రెడ్డికి మొదట 12:30 గంటలకు ఎస్పీ అపాయింట్‌మెంట్ ఇవ్వగా, తర్వాత దానిని 1:30కి మార్చారు. ఆయన ఎస్పీకార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. మొదట ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు సుముఖత వ్యక్తం చేయగా, ఆమె ఫిర్యాదు తర్వాతే ప్రసన్నకుమార్‌కు అనుమతి ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం.

ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కౌంటర్ ఫిర్యాదు ఇచ్చారు. టీడీపీ నాయకులు ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను మహిళలపై దాడిగా అభివర్ణిస్తూ, ఎప్ప‌టిలాగే దీనిని వైఎస్ జగన్‌ (YS Jagan)కు, ఆయ‌న కుటుంబానికి ఆపాదిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) వంటి నాయకులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment