నయనతార మిస్ చేసుకున్న రూ.400 కోట్ల బ్లాక్‌బస్టర్ సినిమా ఏంటో తెలుసా?

నయనతార మిస్ చేసుకున్న రూ.400 కోట్ల బ్లాక్‌బస్టర్ సినిమా ఏంటో తెలుసా?


దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్ స్టార్’‌గా వెలుగొందుతున్న నయనతార, ఇప్పుడు 40 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్‌లకు గట్టి పోటీనిస్తోంది. రెండు దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళం, కన్నడ సినీ రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నయన్, ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తుందని టాక్.

బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన నయన్
సౌత్ ఇండియాను తన నటనతో ఏలేసిన ఈ నటి, తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ సీనియర్ బ్యూటీ, ఆ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ‘జవాన్’ తర్వాత నయనతారకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆమె హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. బడా హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటోంది.

నయన్ చేజార్చుకున్న బిగ్గెస్ట్ హిట్
అయితే, నయనతార తన కెరీర్‌లో ఓ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిందట. ఆమె కాదనడంతో ఆ అవకాశం మరో స్టార్ హీరోయిన్‌కు దక్కి, అది ఆమె కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? అది బాలీవుడ్‌లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’.

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం సాధించింది. షారుఖ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా దీపికా పదుకొణె కెరీర్‌కు మంచి మైలేజ్ ఇచ్చింది. నిజానికి, ఈ సినిమాలో హీరోయిన్‌గా తమిళం మాట్లాడే యువతి పాత్ర కావడంతో దర్శకుడు ముందుగా నయనతారను అనుకున్నారట. అయితే, ఆ సమయంలో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపలేదని, అలాగే వ్యక్తిగత జీవితంలో కొన్ని కీలక మార్పులు జరుగుతుండటంతో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ఆఫర్‌ను తిరస్కరించిందని తెలుస్తోంది. అలా నయన్ చేజార్చుకున్న ఈ బ్లాక్‌బస్టర్ అవకాశం దీపికా పదుకొణెకు దక్కి, ఆమెను స్టార్‌డమ్ స్థాయికి తీసుకెళ్లింది.

Join WhatsApp

Join Now

Leave a Comment