సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara) తాజాగా మాల్దీవుల వెకేషన్లో(Maldives Vacation) సందడి చేస్తున్నారు. సముద్ర తీరంలో వైట్ క్రాప్డ్ టాప్(White Cropped Top), షీర్ ర్యాప్ స్కర్ట్(Sheer Wrap Skirt)తో స్టైలిష్‌గా ఫొటోలకు పోజులిచ్చారు. సముద్రం, ఆకాశం బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఈ ఫొటోలను నయన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఫొటోలు బ్లర్‌గా ఉండటంతో కొందరు నెటిజన్లు ఏఐ సాయంతో వాటి బ్లర్నెస్ను తొలగించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 41 ఏళ్ల వయసులోనూ నయనతార మెయింటైన్ చేస్తున్న ఫిట్‌నెస్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం నయనతార పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ముక్కుత్తి అమ్మన్ 2’,(Mookuthi Amman 2) ‘డియర్ స్టూడెంట్స్’(Dear Students) పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. ‘రక్కయి’(Rakkayie) షూటింగ్ కొనసాగుతోంది. ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’ షూటింగ్ పూర్తయింది. అలాగే బాలీవుడ్లో తెరకెక్కుతున్న #SVC63లోనూ ఆమె నటిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన స్టైలిష్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.








