నాసా(NASA) ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) రాకకు మరోసారి బ్రేక్ పడింది. స్పేస్‌ఎక్స్(SpaceX) రాకెట్ ప్రయోగం వాయిదా పడటంతో ఈ జాప్యం జరిగింది. అమెరికా ఫ్లోరిడా నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేయడం వల్ల ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య తలెత్తడంతో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేశారు. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు మరికొన్ని రోజులు అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్పేస్ మిషన్ ఆలస్యానికి కారణమేంటి?
ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం కోసం క్రూ 10 మిషన్ సిద్ధంగా ఉంది. అయితే, బయల్దేరే క్షణంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య కారణంగా ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని నాసా వెల్లడించింది. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి, వచ్చే వారం మరొక ప్రయోగం చేయనున్నట్లు నాసా ప్రకటించింది. దీనివల్ల సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుంచి భూమి మీదకు రాక మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
2024 జూన్ 5న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఇటీవల సునీతా విలియమ్స్ స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్ష నౌక రానుందని, కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. అయితే, చివరి నిమిషంలో క్రూ-10 ప్రయాణం వాయిదా పడటంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు నిరాశ ఎదుర్కొన్నారు.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్